పారిశుద్ధ్య సమస్యలను అధిగమించేందుకు గత కమిషనర్ గౌతం స్వచ్ఛ ఆటోలను ప్రవేశపెట్టారు. డివిజన్ మొత్తం 240 ఆటోలను కెనరా బ్యాంకు సాహకారంతో నిరుద్యోగ యువకులకు అందజేశారు. ఈ ఆటోలు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తాయి. రవాణా భారం ఎక్కువ కావడం వల్ల ఆటోల నిర్వహణ కోసం చెత్త సేకరణపై 60 రూపాయలను పన్నుగా విధించాలని కౌన్సిల్ తీర్మానం చేసింది.
ఇలా ప్రతిరోజు నగరంలో సేకరించే చెత్తను రాంపూర్‌లోని డంపింగ్ యార్డులో కాకుండా నగర శివార్లలోని ఖాళీ స్థలాల్లో వేస్తున్నారు. అలా వేయడం వల్ల పరిసర ప్రాంత ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కాలనీల వద్ద చెత్త వేయడం వల్ల దుర్గంధం, తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. డీజిల్ ఖర్చులు తగ్గించుకోవడం కోసమే స్వచ్ఛ ఆటో నిర్వాహకులు ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.