రాష్ట్ర స్థాయి నాటక పోటీలకు అపూర్వ స్పందన లభించింది. వరంగల్ నగరంలోని పోతన విజ్ఞాన పీఠంలో తెలంగాణ నాటక అకాడమీ ఆధ్వర్యంలో నాటక పోటీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థినులు హాజరయ్యారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు నాటికలను ప్రదర్శించి తమ ప్రతిభను చాటారు. నర్సంపేట దుగ్గొండి మండలానికి చెందిన పాఠశాల విద్యార్థులు 'బాలిక విద్య' అనే శీర్షికతో రూపొందించిన నాటక పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లింగ వివక్షతతో సాగిన కథ అందరినీ ఆలోచింపజేసింది. ఈ పోటీల్లో గెలిచిన వారు వచ్చే నెలలో రవీంద్ర భారతిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
అలరించిన నాటికలు... ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు - పోతన విజ్ఞాన పీఠం
వరంగల్ గ్రామీణ జిల్లాలోని పోతన విజ్ఞాన పీఠంలో తెలంగాణ నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన నాటికలు అలరించాయి.
నాటికలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 'బాలిక విద్య'