త్వరలోనే రెండు పడకగదుల ఇళ్ల పంపిణీ - rayaparthy
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తైనా ఎన్నికల కోడ్ నియమావళి కారణంగా అవి లబ్ధిదారులకు అందనే లేదు. ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో వాటిని లబ్ధిదారులకు అందించే యోచనలో పడ్డారు అధికారులు.
సిద్ధంగా ఉన్న రెండు పడకగదుల ఇళ్లు
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో 50, మైలారంలో 50 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు కొద్ది నెలల కిందట పూర్తయ్యాయి. అప్పటి నుంచి ఎదురు చూస్తున్న లబ్ధిదారుల కోరిక త్వరలోనే నెరవేరనుంది. ఎన్నికల నేపథ్యంలో పంపిణీలో జాప్యం జరిగినా... ఇప్పుడు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గంలోని రాయపర్తి మండలం పై ప్రత్యేక దృష్టి సారించారు. పంపిణీ చేసే దిశగా అధికారులతో చర్చలు జరుపుతున్నారు.