ఆరోగ్యకరమైన జీవితానికి క్రీడలు దోహదం చేస్తాయని వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల పురపాలక ఛైర్పర్సన్ సోదా అనితారామకృష్ణ అన్నారు. పరకాలలోని ప్రభుత్వ కళాశాల ఆవరణలో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. క్రీడాకారులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అందించిన టీ షర్టులను పంపిణీ చేశారు.
క్రీడలను ఆస్వాదిస్తూ ఆడాలి: పరకాల పుర ఛైర్ పర్సన్ - పరకాలలో వాలీబాల్ టోర్నమెంట్
క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు ఆటను ఆస్వాదించాలని పరకాల మున్సిపల్ ఛైర్పర్సన్ సోదా అనితారామకృష్ణ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ కళాశాల ఆవరణలో నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు.
district level volleyball tournament at parakala
క్రీడాకారుల అభివృద్ధికి ఎమ్మెల్యే ధర్మారెడ్డి కృషి చేస్తున్నారని అనిత అన్నారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం క్రీడాకారులతో కలిసి కాసేపు వాలీబాల్ ఆడారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ విజయపాల్ రెడ్డి, జడ్పీటీసీ మొగిలి, హాకీ క్లబ్ అధ్యక్షుడు సారంగపాణి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రమేశ్, కౌన్సిలర్ సంపత్, వాలీబాల్ క్లబ్ నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:బాణసంచా నిషేధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం