వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మెప్మా ఉద్యోగులకు వేతనాలు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మొట్ట మొదటిసారిగా మెప్మా రిసోర్స్ పర్సన్లకు వేతనాలను అందించింది. ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేల చొప్పున నాలుగు నెలల వేతనాలను అందించారు. మెప్మా ఉద్యోగులకు, ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.
నర్సంపేటలో మెప్మా ఉద్యోగులకు వేతనాల పంపిణీ - ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో మొట్టమొదటిసారిగా మెప్మా ఉద్యోగులకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వేతనాలను అందించారు.
నర్సంపేటలో మెప్మా ఉద్యోగులకు వేతనాల పంపిణీ