వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని ధర్మసాగర్ రిజర్వాయర్లోకి వచ్చే దేవాదుల కాలువను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
దేవాదుల కాలువ ప్రారంభం... రైతుల ముఖాల్లో ఆనందం
15 ఏళ్లుగా నిర్మాణానికి నోచుకోని కాలువ... ఈ రోజు ఏకంగా నీటితో కళకళలాడుతూ రైతుల ముఖాల్లో వెలుగులు నింపింది. వరంగల్ రూరల్ జిల్లాలోని దేవాదుల కాలువను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ కాలువ ద్వారా పరకాల, స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గాలు లాభపడనున్నాయి.
devadula river water started in parakala
ఈ కాలువ నీటి ద్వారా పరకాల, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల్లో 91 వేల 700 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. పరకాల నియోజకవర్గంలో 37వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందనుంది. 15 ఏళ్లుగా కాలువ నిర్మాణం నోచుకోని తరుణంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్థానిక రైతులను సమన్వయం చేస్తూ, లాక్డౌన్ కాలంలో అధికారులను సమాయత్తం చేసి అన్ని తానై అహర్నిశలు కృషి చేశారని మంత్రి కొనియాడారు. దేవాదుల నీరు చూసి రైతులు హర్షం వ్యక్తం చేశారు.