తెలంగాణ

telangana

ETV Bharat / state

'పాసుపుస్తకం లేదని... పంట కొనుగోళ్లు నిలిపివేశారు' - పాసుపుస్తకం లేదని... పంట కొనుగోళ్లు నిలిపివేశారు

వరంగల్ రూరల్ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ లో రైతుల పరిస్థితి దీనంగా ఉంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే సమయానికి అనేక రకాల షరతులతో అన్నదాత ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు.

crop purchase is stopped for the farmers who does not have pass books in parakala agriculture market
పాసుపుస్తకం లేదని... పంట కొనుగోళ్లు నిలిపివేశారు

By

Published : Dec 19, 2019, 9:11 AM IST

పాసుపుస్తకం లేదని... పంట కొనుగోళ్లు నిలిపివేశారు

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్​లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పట్టాదారు పాసు పుస్తకాలు లేకుండా అధికారులు పంట కొనుగోలు చేయడం లేదు.

పట్టాదారు పాసుపుస్తకాల కోసం చెప్పులరిగేలా తిరిగినా లాభం లేకపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పండిన పంటను అమ్ముకుందామంటే పాసుపుస్తకం లేకుండా కొనుగోలు జరపడం లేదని వాపోయారు.

కౌలు ఇచ్చిన వ్యక్తి భూమికి పట్టాదారు పాసుపుస్తకం లేకపోవడం వల్ల కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఏం చేయాలో తెలియక కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తమ పంటను కొనుగోలు చేయాలని కౌలు రైతులు అధికారులను వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details