వరంగల్ గ్రామీణ జిల్లాలో కరోనా రోజురోజుకు విస్తరిస్తున్నది. తాజాగా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్‌లోని ఏడుగురు సిబ్బందికి పాజిటివ్ సోకింది. వర్ధన్నపేట సీఐ విశ్వేశ్వర్ ఈ విషయంపై స్పందించి.. ప్రజలకు పలు సూచనలు చేశారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న ఫిర్యాదు బాక్స్‌లో వేయాలని తెలిపారు.
వర్ధన్నపేటలో కరోనా ఉద్ధృతి.. ఏడుగురు సిబ్బందికి పాజిటివ్! - వరంగల్ పోలీసులు
వరంగల్ గ్రామీణ జిల్లాలో కరోనా ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం సృష్టించింది. ఏడుగురు పోలీస్ సిబ్బందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం వల్ల అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమైన సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంపై ప్రజలు సైతం భయాందోళనలకు గురవుతున్నారు.
వర్ధన్నపేటలో కరోనా ఉధృతి.. ఏడుగురు సిబ్బందికి పాజిటివ్!
అత్యవసరమైతే ఫోన్లో సంప్రదించాలని సూచించారు. చిన్న చిన్న విషయాలకు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడొద్దన్నారు. కాగా, ఏడుగుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ రాగా వారిని హోం క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. పోలీస్ స్టేషన్ శానిటైజేషన్ చేయించామని, వారి ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని సీఐ తెలిపారు.
ఇదీ చదవండి:దేశంలో ఏ పార్టీకి లేని పటిష్ఠమైన యంత్రాంగం తెరాసకు ఉంది: కేటీఆర్
Last Updated : Aug 2, 2020, 12:46 PM IST