తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి వరంగల్ జిల్లా​లో కొవిడ్ కలకలం..​

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత రెండ్రోజుల కంటే మంగళవారం తక్కువ కేసులు నమోదు కావడం కాస్త ఆశాజనకంగా ఉంది. కరోనా లక్షణాలు కనిపించిన వారికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తూ... వెంటనే ఫలితాలను చెబుతున్నారు.

corona cases in warangal
ఉమ్మడి వరంగల్​ జిల్లాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ

By

Published : Jul 22, 2020, 11:37 AM IST

ఉమ్మడి వరంగల్ జిల్లాలలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. అయితే గత రెండు రోజులతో పోలిస్తే మంగళవారం నాడు తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

జిల్లా వ్యాప్తంగా మొత్తం 117 కేసులు నమోదు కాగా... వరంగల్ అర్బన్ జిల్లాలో 34, వరంగల్ రూరల్ జిల్లాలో 20, మహబూబాబాద్ జిల్లాలో 27, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 27, జనగామ జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి.

ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కరోనా పరీక్షలు నిర్వహిస్తుండడం వల్ల 30 నిమిషాలలోపే ఫలితాలు వెలువడుతున్నాయి.

కరోనా వైరస్ బారిన పడిన బాధితుల కుటుంబ సభ్యులు... కాంటాక్టుల్లో లక్షణాలు కనిపించి నట్లయితే వైద్య బృందాలు వారి ఇంటి వద్దకు వెళ్లి మరీ పరీక్షలను నిర్వహిస్తున్నారు.

పరీక్షల్లో పాజిటివ్ వస్తే... బాధితులను హోం ఐసోలేషన్​లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఏఎన్​ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రతిరోజు బాధితుల ఇంటికి వెళ్లి ఉష్ణోగ్రతను చూసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు.. ఏడుగురు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details