రైతులకు కావాల్సింది గిట్టుబాటు ధర కానీ.. మద్దతు ధర కాదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
'రైతులకు కావాల్సింది మద్దతు ధర కాదు.. గిట్టుబాటు ధర' - narsampet mla peddi sudarshan reddy
రైతులు పండించిన సన్నధాన్యం గిట్టుబాటు ధరకు కొనకుండా.. కేంద్రం కొత్త చట్టాలను తీసుకువచ్చిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. వరంంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
నర్సంపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కర్షకులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. రైతులు ఆందోళన చెందవద్దని కేంద్రం మెడలు వంచి గిట్టుబాటు ధర వచ్చేంతవరకు తెలంగాణ సర్కార్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి:సన్న రకానికి మద్ధతు ధర ఇవ్వాలి: రైతులు