వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ 9వ వార్డు ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీ ఇనగాల వెంకట్రాం రెడ్డి ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి దార్న వేణుగోపాల్ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెరాస పార్టీ తరఫున గెలుపొందిన వ్యక్తులు అభివృద్ధి చేయకుండా... స్వలాభం చూసుకున్నారని ఆరోపించారు. భవనాల అనుమతుల కోసం డబ్బులు వసూలు చేస్తూ ఎంతో మందిని ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు.
నియోజకవర్గానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసింది ఏం లేదని విమర్శించారు. చల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లాభం తీసుకొచ్చే పనులే చేపట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే బాగా ఎదిగారు తప్పా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదని ఆరోపించారు. ఈ ఒక్కసారి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని కోరారు.