తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టర్​ ఆకస్మిక సందర్శన.. రికార్డుల పరిశీలన - Collector Haritha latest news

వరంగల్​ గ్రామీణ జిల్లా సంగెం తహసీల్దార్​ కార్యాలయాన్ని జిల్లా పాలనాధికారి హరిత ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులను పరిశీలించారు.

Collector Harita inspected the Sangem Tehsildar's office
కలెక్టర్​ ఆకస్మిక సందర్శన.. పలు రికార్డుల పరిశీలన

By

Published : Oct 18, 2020, 3:41 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో కలెక్టర్ హరిత ఆకస్మిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా సంగెం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి.. పలు రికార్డులను పరిశీలించారు. మండలంలో జరుగుతున్న ఆస్తుల సర్వేపై ఆరా తీశారు. ధరణి నమోదు వివరాలను ఎమ్మార్వోను అడిగి తెలుసుకున్నారు.

ఆస్తుల నమోదుకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీలైనంత త్వరగా ధరణి ఆస్తుల నమోదు జరగాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి.. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సివిల్​ సప్లై కమిషనర్

ABOUT THE AUTHOR

...view details