కరోనా కష్టకాలంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్.. కల్యాణ లక్ష్మీ చెక్కులను అందించి నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నారని వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని 510 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన అన్నారు. దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో 151మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్షా నూట పదహారు రూపాయల చొప్పున మండల కేంద్రాల్లో చెక్కులు పంపిణీ చేశారు.
'ఆర్థిక లోటున్నా పేదింటి ఆడపడుచులను ఆదుకుంటున్నాం' - నల్లబెల్లి మండలంలో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో కల్యాణలక్ష్మీ లబ్ధిదారులకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ఎంత ఇబ్బంది ఉన్నా నిరుపేద ఆడపడుచులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటోందని ఎమ్మెల్యే అన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఎంతో మంది ఆప్తులను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఒక్క సంవత్సరం జీతం వెచ్చించి నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చేస్తున్నానని ఆయన అన్నారు. ప్రతీ ఒక్కరూ కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీపీలు, ఎంపీడీవోలు, రెవెన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రైతుబజార్లలో జనాల అవస్థలు.. సంచార విక్రయ కేంద్రాలకు డిమాండ్