వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన వృద్ధ దంపతులు హుస్సేన్, యూకూబీలను కన్న కొడుకులు ఇంట్లో నుంచి గెంటేశారు. తమ ఐదుగురు పిల్లలకు ఉన్న ఆస్తిని పంచి ఇచ్చేశారు. చనిపోయిన నాలుగో కుమారుడి ఇంట్లోనే ఉంటూ పింఛను సొమ్ముతో జీవనం సాగిస్తున్నారు.
ఐదుగురు పిల్లలకు ఆస్తి పంచారు.. ఆ తర్వాత... - bus stop is home to an old age couple
చెట్టుకు కాయ భారం కాదు. తల్లిదండ్రులకు... పిల్లలు భారం కాదు. కానీ... కొందరు తనయులకు మాత్రం తల్లిదండ్రులు భారంగా మారుతున్నారు. పెంచి పెద్ద చేశారన్న ఇంగితం కూడా లేకుండా ఆస్తులు లాక్కొని రోడ్డుపైకి గెంటేస్తున్నారు. అలా గెంటివేయబడ్డవారే వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన హుస్సేన్, యూకూబీ దంపతులు.
ఆస్తి పంచాక భారమయ్యారు.. బస్టాపే నివాసమైంది
పెద్ద కొడుకుకి ఎక్కువ ఆస్తి ఇచ్చారనే కారణంతో మిగిలిన వారు తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకొని వారిని ఇంట్లోంచి బయటకు గెంటేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారికి బస్టాపే నివాసమైంది. రెండు రోజులుగా అక్కడే ఉన్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని కుమారులను మందలించగా... తల్లిదండ్రులను ఇంటికి తీసుకువెళ్లారు.
Last Updated : Jun 2, 2020, 7:08 PM IST