దేశ ప్రజలు నరేంద్ర మోదీనే మళ్లీ ప్రధానిగా కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి సదానందగౌడ తెలిపారు. హన్మకొండలో జరిగిన వరంగల్ లోక్‌సభ భాజపా పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశానికి సదానందగౌడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లాడెన్‌ను పట్టుకోవడానికి అమెరికా 11 ఏళ్లు శ్రమిస్తే... పుల్వామా దాడి కారకులను మోదీ 11 రోజుల్లోనే తుదముట్టించారని కొనియాడారు. అవకాశవాద, ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెప్పాలని ఎంపీ అభ్యర్థి చింతా సాంబమూర్తి సూచించారు.
'మోదీ పాలనలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది' - meeting
రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా... ఓ వైపు కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూనే... మరోవైపు అగ్రనేతలను రంగంలోకి దింపి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.
భాజపా పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశం