వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల పట్టణంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డయల్ 100 పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు జ్యోస్న పాల్గొన్నారు.
డయల్ 100 పై విద్యార్థినులకు అవగాహన - warangal rural village news
పరకాల పట్టణంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డయల్ 100 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలలకు చెందిన విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు జ్యోస్న హాజరై విద్యార్థినులకు పలు సూచనలు చేశారు.
డయల్ 100 పై విద్యార్థినులకు అవగాహన
డయల్ 100కు ఫోన్ చేస్తే కలిగే ఉపయోగాల గురించి విద్యార్థినులకు ఆమె వివరించారు. స్వీయ రక్షణ విద్యలు నేర్చుకోవాలని సూచించారు. పోలీసులు మహిళ భద్రతకు ప్రధాన కర్తవ్యంగా భావిస్తారని పలు వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ గ్రామీణ జిల్లా అధ్యక్షులు, పరకాల నియోజక జిల్లా ఇంఛార్జి శ్రీ గన్నోజు శ్రీనివాసాచారి, ఎస్ఐ వెంకట క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :నవ వధువు ఆత్మహత్య.. అత్తింటి వేధింపులే కారణం..!