తెలంగాణ

telangana

ETV Bharat / state

గోవధకు పాల్పడుతున్న 10 మంది ముఠా అరెస్ట్ - warangal District latest News

గోవధకు పాల్పడుతున్న 10 మంది సభ్యుల ముఠాను వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి గోవులను, ఎద్దులను వధించేందుకు ఉపయోగించే కత్తులు, గొడ్డళ్లను, మాంసాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 2 ట్రక్కులను, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

గోవధ రవాణాకు ఉపయోగించే ఆయుధాలు స్వాధీనం
గోవధ రవాణాకు ఉపయోగించే ఆయుధాలు స్వాధీనం

By

Published : Aug 3, 2020, 10:07 PM IST

వరంగల్ అర్బన్ జిల్లాలో గోవధకు పాల్పడే 10 మంది ముఠా సభ్యుల్ని హసన్​పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. కత్తులు, గొడ్డళ్లను, మాంసాన్ని రవాణా చేసేందుకు రెండు ట్రక్కులను, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గోవధ చేసి మాంసాన్ని కాజీపేట, వరంగల్, హన్మకొండలో విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

6 ఆవులు, 6 ఎద్దులు స్వాధీనం...

ములుగుకు చెందిన ఓ వ్యక్తి సాయంతో జంగాలపల్లి సంత నుంచి 6 ఆవులు, 6 ఎద్దులను కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకొచ్చారని హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి తెలిపారు. గ్రామస్తులు చూస్తారన్న అభిప్రాయంతో వీటిని గ్రామ శివార్లకు తరలించినచ్లు వివరించారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక గోవధకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు.

ఇవీ చూడండి : 'కరోనా వస్తే పెద్దోళ్లకు చేసే వైద్యమే పేదోళ్లకూ అందించాలి'

ABOUT THE AUTHOR

...view details