A person new innovation: వరంగల్ జిల్లాకు సంగెం మండలం ముమ్మిడివరానికి చెందిన బోనగిరి రవి అనే గీతకార్మికుడు.. కల్లు గీస్తూ జీవనం సాగిస్తుంటాడు. 57 ఏళ్లున్న రవికి రోజురోజుకూ ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. తాటిచెట్టు ఎక్కడం భారంగా మారడంతో.. ఒక ఉపాయం ఆలోచించాడు. ఇప్పుడా పరికరమే అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ పరికరంతో తాటిచెట్టు ఎక్కడం ఎంతో సులువు
A person new innovation: కొత్త పరికరాలను కనిపెట్టాలంటే.. ఉన్నత చదువులే చదవాల్సిన అవసరం లేదని నిరూపించాడు వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి. సంగెం మండలం ముమ్మిడివరానికి చెందిన బోనగిరి రవి అనే గీతకార్మికుడు.. కల్లు గీస్తూ జీవనం సాగిస్తుంటాడు. వయసు పెరగడంతో తాటిచెట్టు ఎక్కడం కష్టమైంది. దీనికి పరిష్కారంగా రవి తయారు చేసిన పరికరం ఇప్పుడు ఎంతో మందిని ఆకర్షించింది.
వరంగల్ జిల్లాలో కల్లుగీత కార్మికుడి నూతన సృష్టి..
గతంలో పార్ట్ టైం క్రేన్ డ్రైవర్‌గా పనిచేసిన అనుభవంతో.. తాటి చెట్టుకు ఒక డమ్మీని ఏర్పాటుచేసి దానికి రెండు గిరకలు అమర్చాడు. తాడు సాయంతో ఓ వైపు కుర్చీ.. మరోవైపు మనిషికి సమాన బరువు అమర్చాడు. దీని సాయంతో ఎలాంటి శ్రమ లేకుండానే.. తాటి చెట్టు ఎక్కేయొచ్చు. రవి ఆవిష్కరణను గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు.
ఇవీ చదవండి: