New Worm at Elukurthy Haveli : వీపుపై కళ్లు, నోరు, ముక్కును పోలిన నల్లటి మచ్చలు.. వింతగొలిపేలా నేలలో కలిసిపోయే వర్ణంలో కనిపిస్తున్న ఈ కీటకాన్ని చూశారా.. ఇది వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీలో శుక్రవారం దర్శనమిచ్చింది. ఎక్కడ నుంచో ఎగురుకుంటూ వచ్చిందని, 2 సెం.మీ. పొడవు ఉందని స్థానికులు ఈటీవీ భారత్కు వివరించారు.
New Worm at Elukurthy Haveli: పుడమిరంగులో పురుగు.. మీరెప్పుడైనా చూశారా..!
New Worm at Elukurthy Haveli : పుడమిరంగులో పురుగు.. వీపుపై కళ్లు, నోరు, ముక్కును పోలిన మచ్చలు. ఈ పురుగును మీరెప్పుడైనా చూశారా..! అరుదుగా కనిపించే ఈ కీటకం వరంగల్ జిల్లా ఎలుకుర్తిలో దర్శనమిచ్చింది.
: పుడమిరంగులో పురుగు
దీన్ని వైట్‌షీల్డ్ బగ్ అంటారని.. టేకు, మునగ చెట్లపై అరుదుగా కనిపిస్తుందని వరంగల్‌లోని వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త కిషోర్ తెలిపారు. ఇది అంత ప్రమాదకరమైన కీటకం కాదని అన్నారు. ఆకులోని పత్రహరితాన్ని హరించి.. ఆకులను నాశనం చేస్తుందని వివరించారు. పుడమి రంగులోని ఈ పురుగు స్థానిుకులను ఆకర్షించింది. వింతైన పురుగును ఆసక్తిగా చూస్తున్నారు.
ఇదీ చదవండి:Land Values in TS: చివరి దశకు భూములు, ఆస్తుల విలువల పెంపు ప్రక్రియ
Last Updated : Jan 29, 2022, 11:04 AM IST