తెలంగాణ

telangana

ETV Bharat / state

పరకాలలో ఘనంగా 52వ గ్రంథాలయ వారోత్సవాలు - latest news of library day weekends

వరంగల్​ రూరల్​ జిల్లా పరకాలలో 52 వ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. పుస్తక పఠనం మనిషి జీవన శైలికి, మేదస్సు అభివృద్ధికి కొలమానాలని జిల్లా పరిషత్​ ఛైరపర్సన్​ గండ్ర జ్యోతి పేర్కొన్నారు.

పరకాలలో 52వ గ్రంథాలయ వారోత్సవాలు

By

Published : Nov 14, 2019, 7:43 PM IST

52 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా పరకాల గ్రంథాలయంలో వారోత్సవాలను జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ బొచ్చు వినయ్ అధ్యక్షతన ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు.

పరకాల ఏసీపీ శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. గ్రంథాలయాలు భవిష్యత్ దిక్సూచీలని ఏసీపీ పేర్కొన్నారు. గ్రంథాలయం వల్ల సమాజంలో అత్యున్నతమైన నైతిక విలువలు గల పౌరులు రూపుదిద్దుకుంటారని అన్నారు.

పుస్తక పఠనం మనిషి జీవన శైలికి మేదస్సు అభివృద్ధికి కొలమానాలని గండ్ర జ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖలు, విద్యార్థులు పాల్గొన్నారు.

పరకాలలో 52వ గ్రంథాలయ వారోత్సవాలు

ఇదీ చూడండి: 'గ్రంథాలయం అంటే జ్ఞానం పంచే దేవాలయం'

ABOUT THE AUTHOR

...view details