తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రకృతి సాగుకు సాయం - వనపర్తి

వనపర్తి జిల్లాలో విశ్వమానవత సంస్థ నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ సదస్సులో మంత్రి నిరంజన్​ రెడ్డి పాల్గొన్నారు. రైతు పెట్టుబడి వ్యయం తగ్గించి, గిట్టుబాటు ధర వచ్చే విధంగా  ప్రణాళికలు తయారుచేస్తున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసేవారికి ప్రభుత్వం తరఫున సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు.

ప్రకృతి సాగుపై అవగాహన

By

Published : Feb 27, 2019, 6:15 PM IST

Updated : Feb 27, 2019, 11:10 PM IST

ప్రకృతి సాగుపై అవగాహన
వనపర్తి వేరుశనగను స్వచ్ఛమైన నూనెగా తయారుచేసి పాలమూరు జిల్లా పేరుతో ఎగుమతి చేయాలన్నది తన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ ​రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో విశ్వమానవత సంస్థ నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. రైతు పెట్టుబడి వ్యయం తగ్గించడం కోసం అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. మామిడి ఎగుమతులు, సంబంధిత పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా ఇటిక్యాల వద్దనున్న ఆయిల్ఫెడ్​ కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మన కంటే గుజరాత్​, ఉత్తరప్రదేశ్​ రాష్ట్రాలు ముందుగానే భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభించాయని.. ఒక్క తెలంగాణలో మాత్రమే 94 శాతం ప్రక్షాళన పూర్తైందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తే ప్రభుత్వం తరఫున సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు మంత్రి నిరంజన్ ​రెడ్డి వెల్లడించారు.
Last Updated : Feb 27, 2019, 11:10 PM IST

ABOUT THE AUTHOR

...view details