కరోనా వైరస్ ప్రబలకుండా ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్‌బాషా అన్నారు. జిల్లా కేంద్రంలో కిరాణషాపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పాలనాధికారి దుకాణాల వద్దకు వచ్చినప్పుడు ప్రజలు తప్పనిసరిగా ఒక మీటర్ దూరం ఉండాలని సూచించారు. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు.
'ప్రజలంతా సామాజిక దూరం పాటించాలి'
కొవిడ్- 19 వ్యాప్తి చెందకుండా ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు వనపర్తి జిల్లా యాస్మిన్‌బాషా.
'ప్రజలంతా సామాజిక దూరం పాటించాలి'
రాజీవ్ చౌరస్తాలోని అపోలో ఫార్మసీ వద్ద ప్రజలు గుంపులుగా ఉండటాన్ని గమనించి.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌కు నివారణ స్వీయ నిర్బంధమేనని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము