"నిబంధనలు ఉల్లంఘిస్తే... ఫిర్యాదు చేయండి" - voters
పార్లమెంట్ ఎన్నికల్లో స్లిప్పుతో ఓటు వేయడానికి వీల్లేదని వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి స్పష్టం చేశారు. ప్రభుత్వం గుర్తించిన ఏదేని గుర్తింపు కార్డుతోనే పోలింగ్ కేంద్రానికి రావాలని సూచించారు.
ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్న దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో పార్టీలకు చెందిన ఫ్లెక్సీలను తొలగిస్తున్నామని కలెక్టర్ శ్వేత మహంతి తెలిపారు. కోడ్ అమల్లోకి వచ్చినందున సర్కార్ కొత్త పనులు చేపట్టరాదని సూచించారు. ఏమైనా ఫిర్యాదులుంటే 1950 డయల్ చేసి లేదా సివిల్ యాప్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చని వెల్లడించారు. వనపర్తి నియోజకవర్గంలో 2,46,976 మంది ఓటర్లు ఉన్నారని నమోదు చేసుకోని వారు మార్చి 15లోపు చేసుకోవాలని స్పష్టం చేశారు. మొత్తం 290 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా పాలనాధికారి తెలిపారు.