తెలంగాణ

telangana

ETV Bharat / state

'భారీమెజార్టీతో రాములును గెలిపించండి' - తెరాస

వనపర్తి జిల్లాలో వ్యవసాయ మంత్రి నిరంజన్​ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాగర్​కర్నూల్​ అభ్యర్థి రాములును భారీ మెజార్టీతో గెలిపించి దిల్లీ పంపించాలని విజ్ఞప్తి చేశారు.

'భారీమెజార్టీతో రాములును గెలిపించండి'

By

Published : Mar 26, 2019, 8:01 PM IST

'భారీమెజార్టీతో రాములును గెలిపించండి'
వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన గిరిజన అభినందన సభకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి హాజరయ్యారు. నాగర్​కర్నూల్​ లోక్​సభ తెరాస అభ్యర్థి రాములును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాములుకు వచ్చే మెజార్టీ... రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ప్రాధాన్యతకు ఇచ్చే కానుకగా భావించాలన్నారు.

పార్లమెంట్​ సభ్యునిగా అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రయోజనాలకోసం అహర్నిశలు పాటుపడతానని రాములు కోరారు.

పార్టీలకు అతీతంగా ప్రజలు ఒక్కటై తెరాస అభ్యర్థి రాములును భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు.

ఇవీ చూడండి:ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్​ అభ్యర్థి విజయం

ABOUT THE AUTHOR

...view details