తెలంగాణ

telangana

ETV Bharat / state

దళితులకిచ్చేందుకు భూములను గుర్తించండి: నిరంజన్​రెడ్డి - వనపర్తిలో జిల్లా స్థాయి మానిటరింగ్​ సమావేశం

అర్హులైన దళితులకు మూడెకరాల భూమి ఇచ్చేందుకు భూములను గుర్తించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలోని నాగవరంలో మంగళవారం ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. దళితులకు భూములు ఇచ్చేందుకు అవసరమైతే భూమిని కొనుగోలు చేయాలని చెప్పారు.

vigilance monitoring meeting in vanaparthy district
దళితులకిచ్చేందుకు భూములను గుర్తించండి: మంత్రి నిరంజన్​రెడ్డి

By

Published : Dec 30, 2020, 9:55 AM IST

అర్హులైన దళితులకు మూడెకరాల భూమి ఇచ్చేందుకు భూములను గుర్తించాలని, అవసరమైతే కొనుగోలు చేయాలని మంత్రి నిరంజన్​రెడ్డి.. అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విజిలెన్స్​ మానిటరింగ్​ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గతంలో దళితులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను ప్రభుత్వ నిర్మాణాలకు వినియోగించినట్లుయితే 123 జీవో ప్రకారం తగిన నష్టపరిహారం చెల్లిస్తామని అన్నారు. గ్రామ పంచాయతీల్లో బిల్లుల మంజూరులో నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు జిల్లా కేంద్రంలో స్టడీ సర్కిల్ మంజూరు చేస్తామని అన్నారు. అప్పటివరకు తక్షణమే కోచింగ్ సెంటర్​ను ప్రారంభించాలని కలెక్టర్​ను ఆదేశించారు.

దళితుల పట్ల చిన్నచూపు వద్దు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ద్వారా 8000 కేసులను పరిష్కరించినట్లు కమిషన్​ ఛైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​ తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వారి చెంతకే వచ్చి 'జన అదాలత్' కార్యక్రమాన్ని నిర్వహించి వారి సమస్యలను పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. దళితుల పట్ల అధికారులు చిన్నచూపు చూడకుండా విధులు నిర్వహించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కేసులను వ్యక్తిగతంగా శ్రద్ధ వహించి పరిష్కరించాల్సిందిగా సూచించారు. గ్రామాల్లో ప్రతి నెలాఖరున పౌర హక్కుల దినం తప్పనిసరిగా నిర్వహించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అనవసరమైన విషయాలపై వినియోగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

పేద దళితులకు న్యాయం చేసేలా అధికారులు కృషి చేయాలని నాగర్​కర్నూల్​ ఎంపీ పోతుగంటి రాములు.. అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఇప్పటివరకు అందించిన నష్టపరిహారం, తదితర వివరాలను జిల్లా కలెక్టర్​ షేక్​ యాస్మిన్​ భాషా.. సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:విడతల వారీగా అందరికీ కరోనా వ్యాక్సిన్: దత్తాత్రేయ

ABOUT THE AUTHOR

...view details