తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్వచ్ఛ కొత్తకోట- హరిత వనపర్తి జిల్లా' - awareness

వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సమావేశ మందిరంలో 'స్వచ్ఛ కొత్తకోట- హరిత వనపర్తి జిల్లా' పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని దేవరకద్ర శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్​ రెడ్డి సూచించారు.

'స్వచ్ఛ కొత్తకోట- హరిత వనపర్తి జిల్లా'

By

Published : Aug 7, 2019, 10:33 AM IST

వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సమావేశ మందిరంలో 'స్వచ్ఛ కొత్తకోట- హరిత వనపర్తి జిల్లా' పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు ఎంపీటీసీలు, మహిళా సమాఖ్య సభ్యులకు హరితహారం, పరిశుభ్రత, ప్లాస్టిక్ రహిత కొత్తకోటగా మార్చేందుకు సదస్సు ఏర్పాటు చేశారు.ప్రతి గ్రామంలో 100% మరుగుదొడ్లు నిర్మించాలని, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని దేవరకద్ర శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్​ రెడ్డి సూచించారు. మానవ మనుగడకు అవసరమైన ఆక్సిజన్ 33 శాతం అవసరమైతే 16 శాతం మాత్రమే లభిస్తుందన్నారు. భావితరాల అవసరాల కోసం ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పేర్కొన్నారు. ఇంటిని ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటామో, అదేవిధంగా గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ వామన్ గౌడ్, డీఆర్​డీఓ పీడీ గణేష్, ఎంపీపీ గుంత మౌనిక,వివిధ గ్రామాల సర్పంచ్​లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

'స్వచ్ఛ కొత్తకోట- హరిత వనపర్తి జిల్లా'

ABOUT THE AUTHOR

...view details