వనపర్తి జిల్లా కొత్తకోట మండంలోని సరళసాగర్ డ్యాంపై ఆధారపడి దాదాపు 600 మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. పెంచిన చేపలు పెద్దయ్యాయి... సంక్రాంతి తర్వాత విక్రయించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇంతలోనే డ్యామ్ తెగిన వార్త వారి గుండెల్లో పిడుగు పిడినంత పని చేసింది. దీంతో ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. చేపల పెంపకం కోసం దాదాపు మూడు నుంచి నాలుగు లక్షలకు పైగా ఖర్చు చేశారు. డ్యామ్‌కు గండి పడి మత్స్య సంపదంతా కొట్టుకుపోవడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
మత్స్యకారుల జీవనోపాధికి 'గండి' - fisherman problems
వారంతా మత్స్యకారులు. వారి జీవనోపాధే చేపల వేట. లక్షల్లో పెట్టుబడి పెట్టి చెరువులో చేపలు పెంచారు. సంక్రాంతి తర్వాత చేపలు విక్రయించాలని కమిటీ ఏర్పాటు చేసుకొని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే ఆశలన్నీ అడియాసలయ్యాయి. కష్టపడి పెంచిన చేపలు కళ్ల ముందే గ్రామస్థులు పట్టుకెళ్తుంటే... చెమర్చిన కళ్లతో దీనంగా చూస్తూ ఉండిపోయారు.
మత్స్యకారుల జీవనోపాధికి 'గండి'
ఆరుగాలం కష్టపడి పెంచిన చేపలను... నీటి ప్రవాహం చూసేందుకు వచ్చిన ప్రజలు ఎవరికి తోచినట్లు వారు పట్టుకెళ్తుంటే అచేతనంగా చూస్తూ ఉండిపోయారు. చేపల వేటపైనే ఆధాపడి జీవనం గడిపే తమ కుటుంబాలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: తెలంగాణ నూతన సీఎస్‌గా సోమేశ్ కుమార్