తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం అవసరం : కలెక్టర్ భాష - కలెక్టర్ భాష

గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాల్లో ప్రజల భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అభిప్రాయపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామమ్యం వహించి వాటన్నింటిని శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం అవసరం : కలెక్టర్ భాష
అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం అవసరం : కలెక్టర్ భాష

By

Published : Sep 3, 2020, 7:20 PM IST

వనపర్తి జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెం, సవాయిగూడెం , కిష్టగిరి గ్రామాలను కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సందర్శించారు. నిర్మాణంలో ఉన్న పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలను ఆమె తనిఖీ చేశారు. తొలుత పెద్దగూడెం గ్రామంలో రైతు వేదికను తనిఖీ చేసి పల్లె ప్రకృతి వనంతో పాటు రైతు వేదిక నిర్మాణం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు వేదిక నిర్మాణ పనులను సైతం వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.

'అవసరమైన రంగులు అద్దాలి'

క్రిష్ణగిరిలో పల్లె ప్రకృతి వనం నిర్మాణం పట్ల సిబ్బందిని మెచ్చుకున్నారు. పల్లె ప్రకృతి వనానికి ఇంకా అవసరమైన రంగులు వేయాలని అందంగా ఉండేలా రంగురంగుల మొక్కలను నాటించాలని సూచించారు. ఎప్పటికప్పుడు మొక్కలు నాటడం సహా శుభ్రంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రాజేశ్వరి , పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివకుమార్ , ఎంపీడీఓ రవీంద్ర బాబు, ఎంపీపీ కిచ్చారెడ్డి, సర్పంచ్ కొండయ్య, తదితరులు ఉన్నారు.

ఇవీ చూడండి : ప్రసవానంతరం ఈ మార్పులు సహజమే !

ABOUT THE AUTHOR

...view details