తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2020, 2:31 PM IST

Updated : Jun 9, 2020, 2:38 PM IST

ETV Bharat / state

ఎక్కడికెళ్లినా మీతోపాటు ఇంటిని కూడా తీసుకెళ్లొచ్చు...

లక్షలు వెచ్చించి ఇళ్లు నిర్మిస్తుంటాం.. ఏదైనా కారణం చేత ఇల్లు విడిచి వెళ్లాల్సివస్తే మరోచోట కోరుకున్నట్లుగా ఇల్లు లేక ఇబ్బందులు పడతాం.. అలాకాకుండా నిర్మించుకున్న ఇంటినే వెంట తీసుకువెళ్లే అవకాశం ఉంటే ? అలాంటి ఇల్లే ప్రస్తుతం వనపర్తి జిల్లాలో ప్రజలను ఆకట్టుకుంటోంది.

ready made pre fabricated house in wanaparthi district
రెడీమేడ్ ప్రీ ఫాబ్రికేటెడ్ మొబైల్ హౌస్

మీతోపాటు ఇంటిని తీసుకెళ్లండి..

ఇల్లు నిర్మించామంటే ఆ గూడు అక్కడే ఉంటుంది. ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని మరో చోటికి తీసుకెళ్లడం సాధ్యమా..? ఓ వ్యక్తి తన ఇంటిని ఎక్కడికైనా తీసుకెళ్లాలా నిర్మించుకున్నారు. నమ్మశక్యం కావడం లేదు కదా..! ఇది ముమ్మాటికి నిజం. అదే రెడీమేడ్ ప్రీ ఫాబ్రికేటెడ్ మొబైల్ హౌస్.

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లికి సమీపంలో జాతీయ రహదారికి అనుకుని ఉన్న ఫామ్ హౌస్​లో ఉంది ఈ రెడీమేడ్ ప్రీ ఫాబ్రికేటెడ్ మొబైల్ హౌస్. ఆరడుగుల సిమెంట్ కాంక్రీట్ పిల్లర్లు నిర్మించి... ఆ పునాదులపై ఈ రెడీమేడ్ ఇంటిని నిలబెట్టారు.

25 అడుగుల వెడల్పు, 12 అడుగుల పొడవు

హైదరాబాద్​లోని కొంపల్లి పక్కనున్న దూలపల్లిలో ఈ రెడీమేడ్ హౌస్​ తయారయింది. అక్కడ నుంచి లారీల్లో తీసుకొచ్చి.. క్రేన్​ సాయంతో పిల్లర్లపై ఈ ఇంటిని కూర్చోబెట్టారు. 25 అడుగుల వెడల్పు, 12 అడుగుల పొడవుతో ఈ ఇంటిని రూపకల్పన చేశారు. ఈ విస్తీర్ణంలో ఓ హాల్, బెడ్ రూం, అటాచ్డ్ బాత్ రూం ఉన్నాయి. గాలి, వెలుతురు కోసం నాలుగు కిటికీలు ఉన్నాయి.

8 లక్షల రూపాయలు

ఇంటి నిర్మాణానికి ఎలాంటి సిమెంట్, ఇటుక, కాంక్రిట్ వాడలేదు. అన్ని ఇనుప కడ్డీలు, చెక్క, ఫైబర్, టైల్ లాంటి రెడీమేడ్ వస్తువులను ఉపయోగించి తయారు చేశారు. ఇంటికి ముందు భాగంలో ఆరడుగుల బాల్కనీ, మెట్లు కూడా రానున్నాయి. నీటి సౌకర్యం కోసం ట్యాంకును అమర్చనున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇంటి నిర్మాణం పూర్తైంది. నిర్మాణానికి సుమారు 8లక్షలు ఖర్చైందని నిర్వాహకులు చెప్పారు. కావాలంటే మరోచోటికి ఈ ఇంటిని తరలించుకుపోవచ్చని తెలిపారు.

ఇవీ చూడండి:కాపురానికి రానందుకు భార్య, మామను కిరాతకంగా చంపిన భర్త

Last Updated : Jun 9, 2020, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details