రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం కోసం.. వనపర్తి జిల్లాలోని పలు మండలాలతో పాటు.. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు వెళ్లి... అక్కడ కొనుగోలు చేశారు. 15 రోజుల్లో డబ్బులు మీ ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు.
అధికారులు గొర్రెలు కొనుగోలు చేసి నాలుగు నెలలు గడుస్తున్నా... అమ్మకం దారులకు డబ్బులు పంపలేదు. ఇన్నాళ్లు వేచి చూసినా ఫలితం లేక... శనివారం వనపర్తికి చేరుకున్నారు. మొదటగా జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతిని కలిసి తమకు డబ్బులు చెల్లించాలని కోరగా... మీ దగ్గర గొర్రెలు కొనుగోలు చేసిన అధికారులను తీసుకుని రావాలని కలెక్టర్ సూచించారు. వెంటనే జిల్లా పశువైద్యాధికారి అయిన హరికృష్ణను సంప్రదించారు. తాను కొత్తగా ఉద్యోగంలోకి వచ్చానని కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియదని చెప్పారు. అధికారుల తీరు పట్ల అమ్మకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.