తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతంతో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ మృతి - Private electrician died of Current Shock latest news

వ్యవసాయ పొలంలో విద్యుత్​ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా వెంకటేశ్వర్లు అనే ప్రైవేట్​ ఎలక్ట్రీషియన్‌ విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Private electrician died of Current Shock at Kadukuntla village in Wanaparthy district
విద్యుదాఘాతంతో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ మృతి

By

Published : Jun 22, 2020, 8:14 PM IST

వనపర్తి జిల్లా వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన వారాల వెంకటేశ్వర్లు అనే ఎలక్ట్రీషియన్ విద్యుత్ షాక్​తో మరణించారు. గ్రామానికి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న వ్యవసాయ పొలంలో విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. జేసీబీ సహాయంతో వైర్ల మధ్య చిక్కుకున్న మృతదేహాన్ని కిందకు దించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మృతునికి భార్య, బిడ్డలు ఉన్నారు. అతని కుటుంబాన్ని విద్యుత్ శాఖ, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. అందరితో కలిసిమెలిసి ఉండే వెంకటేశ్వర్ల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details