తెలంగాణ

telangana

ETV Bharat / state

అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చుతున్న ఓటర్లు - elections

వనపర్తి జిల్లా కొత్తకోట, మదనాపురంలో ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటేసేందుకు ప్రజలు ఆసక్తిగా పోలింగ్ కేంద్రాలకు తరలొస్తున్నారు.

ఓటేసేందుకు ప్రజలు ఆసక్తి

By

Published : May 10, 2019, 11:01 AM IST

వనపర్తి జిల్లా కొత్తకోట, మదనాపురం మండలాల్లో రెండు జడ్పీటీసీ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు, 20 ఎంపీటీసీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఎండ కారణంగా ఉదయమే ఓటేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఓటర్లుకు ఇబ్బంది కలుగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఓటేసేందుకు ప్రజలు ఆసక్తి

ABOUT THE AUTHOR

...view details