తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్కు పెట్టుకోని వారిపై కొరడా.. 275 మందికి జరిమానా - corona updates

వనపర్తి జిల్లాలో కొవిడ్​ నిబంధనలు పాటించని వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు పెట్టుకోకపోతే ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్క రోజే 275 మందికి జరిమానా విధించారు.

police fined on 275 members for not wearing masks
police fined on 275 members for not wearing masks

By

Published : Jul 29, 2020, 11:28 PM IST

కరోనా మహమ్మారి కట్టడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వ్యక్తులపై వనపర్తి జిల్లా పోలీసులు కొరడా ఝుళిపించారు. బుధవారం ఒక్క రోజే ఏకంగా... 275 మందికి రూ.1000 చొప్పున జరిమానాలు విధించారు. ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని అన్ని పోలీస్​స్టేషన్లలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు... మాస్క్​ ధరించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిని గుర్తించి జరిమానాలు విధించారు.

కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోన్న తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్లపై తిరిగే వారికి అవగాహన కల్పిస్తూనే జరిమానాలు విధించినట్లు ఏఎస్పీ షాకీర్​ హుస్సేన్ పేర్కొన్నారు. నిబంధనలు పాటించని 275 మందికి రూ.వెయ్యి చొప్పున రూ.2.75 లక్షలు ఒకే రోజు జరిమానాల రూపంలో వసూలు చేసినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన రోజుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరించారు.

ఇవీ చూడండి:గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స

ABOUT THE AUTHOR

...view details