వనపర్తి జిల్లా పెద్దగూడెం, కడుకుంట్ల గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం తడిసిపోయింది. కడుకుంట్లలో రైతుల నుంచి కొనుగోలు చేసిన దాదాపు 2 వేల బస్తాలు స్వల్పంగా వర్షానికి తడిశాయి. పెద్దగూడెంలో అన్నదాతలు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యంపై కవర్లు కప్పి ఉంచడంతో కొంతవరకు ధాన్యం తడిసింది.
అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం - paddy grains collapsed due to rain
ఓ వైపు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం.. మరోవైపు వారి నుంచి కొనాల్సిన ధాన్యం.. రెండూ అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయి. వాటిపై కవర్లు కప్పకపోవడంతో చేతికొచ్చిన ధాన్యం నీటిపాలైంది. వనపర్తి జిల్లాలో నిన్న కురిసిన అకాల వర్షానికి అన్నదాతలకు ఈ పరిస్థితి ఎదురైంది.
కొమగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం
వర్షానికి తడిసిన ధాన్యాన్ని అధికారులు మద్దతు ధరకే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంపై కప్పడానికి కవర్లు లేకపోవడంతో చూస్తూ ఉండిపోవాల్సి వచ్చిందని నిర్వాహకులు వాపోయారు.