మన పథకాలు దేశం మొత్తం అమలుకావాలి - తెరాస పథకాలు
వనపర్తి జిల్లా పెబ్బేరులో నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి నిరంజన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ తెరాస అభ్యర్థి రాములు పాల్గొన్నారు. తెలంగాణ పథకాలు దేశం మొత్తం అమలుకావాలని మంత్రి ఆకాంక్షించారు.
భాజపా, కాంగ్రెస్‌లకు తెరాసనే ప్రత్యామ్నాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో నిర్వహించిన రోడ్‌షోలో నాగర్ కర్నూల్ తెరాస అభ్యర్థి రాములుతో కలిసి పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తైనా... జాతీయ పార్టీలు పూర్తి స్థాయిలో పేదరికం, నిరక్షరాస్యతను రూపుమాప లేకపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశం మొత్తం అమలుకావాల్సిన అవసరం ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాములును భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు.
ఇవీ చూడండి:కాంగ్రెస్ విజయం జీవన్‌రెడ్డితో ప్రారంభం: పొన్నం