తెలంగాణ

telangana

ETV Bharat / state

పసిబిడ్డకు కాలం చెల్లిన మందులిచ్చిన ప్రైవేటు ఆస్పత్రి.. పాప మృతి

వనపర్తి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్లక్ష్యానికి ఓ పసిపాప బలైంది. కాలం చెల్లిన మందులివ్వడంతో పుట్టిన ఒకరోజుకే మృతి చెందింది. బంధువుల ధర్నాతో దిగివచ్చిన యాజమాన్యం.. తాము కాలం చెల్లిన మందులు ఇవ్వడం వాస్తవమేనని.. దానివలన ప్రాణాపాయం జరగదని సమర్థించుకునే ప్రయత్నం చేసింది.

wanaparthy news
పసిబిడ్డకు కాలం చెల్లిన మందులిచ్చిన ప్రైవేటు ఆస్పత్రి.. పాప మృతి

By

Published : Aug 14, 2020, 5:21 PM IST

వనపర్తి పట్టణం గాంధీనగర్​కు చెందిన రవి నాయుడు ఈ నెల ఏడున తన భార్య జయశ్రీ ప్రసవం కోసం వనపర్తి మల్టీ స్పెషాలిటీ తీసుకొచ్చాడు. అదేరోజు జయశ్రీ ఆస్పత్రిలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజు పసికందు అనారోగ్యంతో మృతిచెందని చెప్పినట్లు రవి తెలిపారు.

తన బిడ్డకు కాలం చెల్లిన మందులు ఇవ్వడంతోనే మరణించిందని తండ్రి ఆరోపించారు. బంధువులతో కలిసి ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. దిగివచ్చిన యాజమాన్యం.. తాము కాలం చెల్లిన మందులు ఇవ్వడం వాస్తవమేనని.. దానివలన ప్రాణాపాయం జరగని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని బాధితులు స్పష్టం చేశారు.

పసిబిడ్డకు కాలం చెల్లిన మందులిచ్చిన ప్రైవేటు ఆస్పత్రి.. పాప మృతి

ఇవీచూడండి:అనుచిత వ్యాఖ్యల కేసులో కత్తి మహేశ్ అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details