తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస ఎంపీల "కీ" కేసీఆర్ చేతిలో: శ్రుతి - భాజపా అభ్యర్థి

కేసీఆర్​ 'కీ' ఇస్తేనే తెరాస ఎంపీలు పని చేస్తారని నాగర్​కర్నూల్​ భాజపా ఎంపీ అభ్యర్థి బంగారు శ్రుతి విమర్శించారు. తనను గెలిపిస్తే వనపర్తి జిల్లాలో పెద్దమందడి మండలాన్ని రాష్ట్రంలోనే నంబర్​ వన్​గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భాజపా అభ్యర్థి బంగారు శ్రుతి

By

Published : Apr 4, 2019, 5:44 PM IST

ఎన్నికల ప్రచారంలో భాజపా అభ్యర్థి బంగారు శ్రుతి
తనను గెలిపిస్తే గద్వాల నుంచి మాచర్ల, కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు రైల్వే లైన్​ ఏర్పాటు చేయిస్తానని నాగర్​కర్నూల్​ భాజపా అభ్యర్థి బంగారు శ్రుతి హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో రైల్వే జంక్షన్​ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో ప్రచారం నిర్వహించిన శ్రుతి.. తెరాస ఎంపీలనుగెలిపించినా సొంత నిర్ణయాలు తీసుకోలేరని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details