పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో పర్యటించారు. ముందుగా మంత్రి పట్టణంలో అపరిశుభ్రత కారణంగా ఇటీవల ప్రజలు వైరల్ ఫీవర్ బారిన పడుతున్న ప్రాంతాలను పరిశీలించారు వైరల్ ఫీవర్ వచ్చేందుకు ఉన్న కారణాలను, పరిశుభ్రత లోపాలను పరిశీలించారు.
ప్రజలంతా పరిశుభ్రతను పాటించాలి: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి జిల్లా అమరచింతలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. ప్రజలంతా పరిశుభ్రతను పాటించాలని సూచించారు. అందరూ భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
అపరిశుభ్రత వల్ల ప్రజలు వైరల్ జ్వరాలకు గురయ్యే అవకాశం ఉందని, ఆ విధంగానే అమరచింతలో కొంతమంది ప్రజలు వైరల్ ఫీవర్ బారిన పడినట్లుగా తెలిపారు. కేవలం ఇద్దరు మాత్రమే శ్వాస కోస ఇబ్బందితో చనిపోయారని , తక్కిన వారందరూ ఆరోగ్యంగానే ఉన్నారని, వారందరిని త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నట్లు వెల్లడించారు. తప్పనిసరిగా ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించాలని, అంతేకాక మాస్కులు ధరించాలని, వైరల్ ఫీవర్ బారిన పడకుండా ఉండేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రజలకు సూచించారు.
ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా... 650కి చేరిన కేసులు