వనపర్తి సమీపంలోని తాళ్ల చెరువును అభివృద్ధి చేసి పట్టణ వాసులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. చెరువులో ఉన్న చెట్లు మొత్తం తీసివేసి పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
తాళ్ల చెరువును అభివృద్ధి చేస్తాం: మంత్రి నిరంజన్ రెడ్డి - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
తాళ్ల చెరువును అభివృద్ధి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తికి సమీపంలో ఉన్న ఈ చెరువులో చెట్లను తొలగించే పనులను ప్రారంభించారు.
తాళ్ల చెరువును అభివృద్ధి చేస్తాం: మంత్రి నిరంజన్ రెడ్డి
తాళ్లచెరువును నీటితో నింపుతామని చెప్పారు. స్థానికులు చెత్తను చెరువులో వేయొద్దని కోరారు. మున్సిపాలిటీ పరిధిలో భవిష్యత్తులో లే అవుట్లు మంజూరు చేసే సమయంలో చెరువు శిఖం దృష్టిలో ఉంచుకొని అనుమతులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. పలువురికి మాస్కులు పంపిణీ చేశారు.
Last Updated : Apr 11, 2020, 10:04 PM IST