నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ పాలన సాగించాలని నూతన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లా వెల్టూరు గ్రామంలో నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఏర్పాటుచేసిన సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖరీఫ్‌లో రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి, ఎవరైన కల్తీకి పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. త్వరలో జిల్లాస్థాయిలో అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తామన్నారు.
నిత్యం ప్రజల మధ్యే ఉండాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి
నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని నూతన ప్రజాప్రతినిధులకు మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. త్వరలో శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తామన్నారు.
నిత్యం ప్రజల మధ్యే ఉండాలి