వనపర్తి జిల్లా పరిధిలోని ఆటో, రిక్షా డ్రైవర్లు, మున్సిపాలిటీ కార్మికులు, ఆశా వర్కర్లు, తదితరులకు మంత్రి నిరంజన్ రెడ్డి నిత్యావసరాలను అందజేశారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ మొదటిరోజు వెయ్యి మందికి సరకులను అందజేశామన్నారు.
వెయ్యి మంది కార్మికులకు మంత్రి నిరంజన్ రెడ్డి సాయం - కార్మికులకు మంత్రి సాయం
రోజువారి ఆదాయంపై ఆధారపడి జీవించే వెయ్యి మంది కార్మికులకు మంత్రి నిరంజన్ రెడ్డి నిత్యావసరాలను పంపిణీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు.
వెయ్యి మంది కార్మికులకు మంత్రి నిరంజన్ రెడ్డి సాయం
మరో రెండు రోజుల తర్వాత వెయ్యి మందికి అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ నిరుపేద కార్మికులకు తమ వంతుగా సాయం అందిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి :ఆ మహిళల ఆత్మహత్యలకు కారణాలెంటి..గ?