వనపర్తి జిల్లా కొత్తకోట, మదనాపురం, అడ్డాకుల మండలాల్లోని పలు గ్రామాల్లోి రైతు వేదికల నిర్మాణానికి శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి శంకుస్థాపన చేశారు. అంతేకాక తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటారు.
కరోనా కాలంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు ఇబ్బందులు కలగకుండా రైతు బంధు పథకం కింద రైతు ఖాతాల్లో పెట్టుబడి నిధులను జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 55 లక్షల 5 వేల మంది ఖాతాల్లో రూ. 7 వేల కోట్లను జమ చేసినట్లు వెల్లడించారు. ఇంకా రైతు బంధు రావాల్సిన వారు నాలుగు లక్షలకుపైగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. న్యాయబద్ధంగా రైతు బంధుకు అర్హత ఉండి రానట్లైతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.