వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెళ్లికి చెందిన నర్సమ్మ కాలికి గాయమై ఇన్ఫెక్షన్ అయింది. ఆసుపత్రికి వెళ్లలేని దుస్థితిలో ఉన్న ఆమె వివరాలను గ్రామ యువకులు... మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. స్పందించిన మంత్రి.. బాధితురాలి వివరాలను జిల్లా పాలనాధికారిణి షేక్ యాస్మిన్ బాషాకు పంపారు. బాధితురాలని వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
యువకుల ట్వీట్.. స్పందించిన కేటీఆర్
వనపర్తి జిల్లా నాటవెళ్లికి చెందిన యువకులు చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఓ వృద్ధురాలి కాలికి గాయమై బాధపడుతున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి... బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
యువకుల ట్వీట్.. స్పందించిన కేటీఆర్
నాటవెళ్లికి వెళ్లి నర్సమ్మతో మాట్లాడి.. సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ యాస్మిన్ బాషా.. జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులను ఆదేశించారు. గ్రామానికి చేరుకున్న వైద్యాధికారి నర్సమ్మతో మాట్లాడి.. ఆమె కాలి గాయాన్ని పరిశీలించారు. 108 అంబులెన్స్ ఏర్పాటు చేసి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.