రైతులు వాణిజ్య పంటలైన ఆయిల్ ఫామ్, పత్తి, కంది పంటలపై ఎక్కువగా దృష్టి సారించాలని... ప్రతి ఒక్కరూ పంట మార్పిడి చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో విత్తనోత్పత్తి గ్రామమైన చిన్న మందడిలో 25 మంది రైతులు పండించిన సన్నరకం వరి విత్తనాలను ఆయన పంపిణీ చేశారు. గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయని మంత్రి పేర్కొన్నారు. రైతులు పండించే కూరగాయల కోసం వనపర్తిలోని మార్కెట్లో, పెబ్బేరు మార్కెట్లో స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Minister niranjanreddy: వాణిజ్య పంటలపై దృష్టి సారించాలి: నిరంజన్ రెడ్డి
వనపర్తి జిల్లాలోని విత్తనోత్పత్తి గ్రామమైన చిన్న మందడిలో 25 మంది రైతులు పండించిన సన్నరకం వరి విత్తనాలను మంత్రి నిరంజన్ రెడ్డి గ్రామస్తులకు పంపిణీ చేశారు. ప్రతీ ఒక్కరు పంట మార్పిడి పద్దతిని పాటించాలని ఆయన సూచించారు.
వాణిజ్య పంటలపై దృష్టి సారించాలి: నిరంజన్ రెడ్డి
చిన్న మందడి రైతులు జిల్లాకి ఆదర్శం కావాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రానున్న కాలంలో ప్రతీ ఒక్కరు వాణిజ్య పంటలు, కూరగాయల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. రైతులు వ్యవసాయంలో ఖర్చులను తగ్గించుకునే పద్ధతులను అవలంభించాలని... కూలీల కొరత తీర్చుకునేందుకు వరిలో వెదజల్లే పద్ధతి పాటించాలన్నారు. దాంతో రైతుకు 10 నుంచి 15 వేల వరకు ఖర్చు తగ్గుతుందని మంత్రి సూచించారు.
ఇదీ చూడండి:Petrol Price: హైదరాబాద్‌లోనూ సెంచరీ దాటిన పెట్రోల్