ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

కూతురిని చంపి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి - కూతురిని చంపి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి

ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ... నవమాసాలు మోసి కన్న కూతురినే... తన చేతులతో హత్య చేసింది. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన వనపర్తి జిల్లా కొత్తపేట మండలం పాలెంలో చోటుచేసుకుంది.

కూతురిని చంపి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి
author img

By

Published : Apr 8, 2019, 11:08 AM IST

Updated : Apr 8, 2019, 3:33 PM IST

కూతురిని చంపి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి

వనపర్తి​ జిల్లాలోని పాలెం గ్రామానికి చెందిన నిర్మల (35) భర్త రెండేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి తన కుమార్తె సింధు(8)తో కలిసి అమ్మగారింట్లో ఉంటుంది. ఉగాది పండుగ సందర్భంగా అత్తగారి ఊరైన పాలెంకు వెళ్లింది.

పండుగ మరోసటి రోజు ఆదివారం అర్ధరాత్రి... కూతురిని కత్తితో గొంతులో పొడిచింది. చనిపోయిందని నిర్ధరణకు వచ్చాక... తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

గమనించిన కుటుంబసభ్యులు కొన ఊపిరితో ఉన్న నిర్మలను చికిత్స కోసం వనపర్తి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. చనిపోయింది ఆ తల్లి. తల్లికూతుళ్ల మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:'కాంగ్రెస్​లో నాయకత్వం బలహీనంగా ఉంది'

Last Updated : Apr 8, 2019, 3:33 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details