నూతన ఆవిష్కరణలలో భాగంగా ఉత్సాహవంతులు తయారుచేసిన నమూనాలను ప్రదర్శించేందుకు వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ప్రత్యేక దరఖాస్తులను కోరారు. ఈ నేపథ్యంలో జిల్లాలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆత్మకూర్లోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు రోబో సహాయంతో బరువు ఎత్తుట, అనేక రంగులలో మనం అనుకున్న రంగును సులభంగా గుర్తించే విధంగా రోబోటిక్ యంత్రాలను తయారుచేసి ప్రదర్శించారు. వీరికి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, ఎస్పీ అపూర్వ రావు చేతులమీదుగా ప్రశంసా పత్రాలను అందించారు.
ఇంటింటా ఇన్నోవేటర్.. రోబోటిక్ యంత్రాల ప్రదర్శన - రోబోటిక్ యంత్రాలు
వనపర్తి జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థుల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది.
ఇంటింటా ఇన్నోవేటర్.. రోబోటిక్ యంత్రాల ప్రదర్శన