వనపర్తి జిల్లాలోని పలు మండలల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. పెబ్బేరు, పానగల్, వీపనగండ్ల మండలాల్లో కురిసిన వాన.. తన ఉద్ధృతిని చూపించింది. పెబ్బేరు మండలంలో 156 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.
వనపర్తి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం.. నీట మునిగిన వరి
వనపర్తి జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి భారీ వర్షం నమోదయ్యింది. పలు మండలాల్లో కురిసిన వాన ఉద్ధృతికి కుంటలు, చెరువులు పొంగిపొర్లి.. వివిధ గ్రామాలు జలదిగ్బంధం అయ్యయాయి. వందల ఎకరాల్లోని వరి నీటమునిగింది.
వనపర్తి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం.. నీట మునిగిన వరి
దీనితో పెబ్బేరు, వనపర్తి, పానగల్లు, కొల్లాపూర్, నాగరాల రహదారులు జల దిగ్బంధం అయ్యాయి. పలు చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. వందల ఎకరాల్లోని వరిపంట నీట మునిగింది. ఇప్పటికే నిండుకుండను తలపిస్తున్న వాగులు వంకలు రాత్రి కురిసిన వర్షంతో అలుగులు పోశాయి.
ఇదీ చూడండి :భాజపా రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్