వనపర్తి జిల్లా కొత్తకోట, మదనాపురం మండలంలో తెల్లవారుజామున కురిసిన వర్షం అన్నదాతలకు తీవ్రనష్టం మిగిల్చింది. చేతికొచ్చిన పంటను సొమ్ము చేసుకునేందుకు ఆరబోసిన రైతులకు ఉదయాన్నే తడిసిన ధాన్యం దర్శనమిచ్చింది. కోతకు వచ్చిన వరి నేలకు ఒరిగింది.
అకాల వర్షం గుండెకోత మిగిల్చింది: రైతులు - కొట్టుకుపోయిన ధాన్యం
అకాల వర్షానికి రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆరుగాలం పండించిన పంట... చేతికందే సమయానికి వర్షం వచ్చి తమ ఆశలను నిరాశచేసి... గుండెకోత మిగిల్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షం గుండెకోత మిగిల్చింది: రైతులు
రోడ్డుపై ఆరబోసిన ధాన్యం అంతా కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అగచాట్లుపడుతున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు.
ఇదీ చూడండి:అకాల వర్షం: ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణం