రాష్ట్రంలో మున్సిపాలిటీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి చెందాయని స్పష్టం చేశారు మాజీ మంత్రి, భాజపా నాయకురాలు డీకే అరుణ. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలను అస్సలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. తమ బలం నిరూపించుకునేందుకు భాజపా సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. అన్ని అధికారాలు తన వద్ద ఉంచుకుని స్థానిక సంస్థల ప్రతినిధులకు అధికారాలు లేకుండా చేశారని మండిపడ్డారు.
'రాష్ట్రంలో కేసీఆర్ పేరు తప్ప మరో పేరు వినపడొద్దా?'
" కేసీఆర్ను హెచ్చరిస్తా ఉన్నా... మీకు అధికారాలు కావాలి తప్పా.. ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు ఎవరికి ఉండొద్దా?.. అన్నీ అధికారాలు నీ కుటుంబం చేతిలో ఉండాలన్న వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారు." --- వనపర్తిలో మాజీ మంత్రి డీకే అరుణ
వనపర్తిలో మాజీ మంత్రి డీకే అరుణ