వధూవరులిద్దరి బంధువులు, ఇరు కుటుంబాల పెద్దలు వారిద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించారు. శుక్రవారం ఉదయం 8.10 గంటలకు ముహూర్తం. పెళ్లి తంతు మొదలైంది. పురోహితులు వేదమంత్రాలు చదువుతూ వధువు తలపై జీలకర్ర, బెల్లం పెట్టమని వరుణ్ని పురమాయించారు. ఇంతలో ఆమె ఒక్కసారిగా కేక పెట్టింది. ‘'ఆపండి.. ఈ పెళ్లి నాకిష్టం లేదు’' అంటూ పెళ్లిపీటల నుంచి పక్కకు వచ్చేసింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గబ్బర్‌సింగ్ పెళ్లి సీన్ రిపీట్... పీటల మీది నుంచి వెళ్లిపోయిన వధువు
సరిగ్గా... తాళి కట్టే సమయంలో "ఆపండి..." అనే మాట వినిపిస్తోంది. అప్పటి వరకు ఎంతో కోలాహలంగా ఉన్న మండపం ఆ మాటతో నిశ్శబ్దంగా మారిపోతుంది. ఇదీ చాలా సినిమాల్లో వినిపించే మాట... కన్పించే దృశ్యం. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సినిమా గబ్బర్‌సింగ్‌లోని పెళ్లి సన్నివేశం వనపర్తిలో రిపీటయ్యింది. ఇక్కడ... ఆపండి అన్నది మాత్రం పెళ్లికూతురేనండోయ్...! కారణమేమిటంటే...
BRIDE WALKED OUT FROM MARRIAGE WHEN HER FRIEND CAME
అమ్మాయి కుటుంబం చాలా రోజుల క్రితమే మహారాష్ట్రలోని షోలాపూర్‌లో స్థిరపడింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన అబ్బాయితో పెద్దలు ఆమెకు పెళ్లి తలపెట్టారు. షోలాపూర్ నుంచి వధువు స్నేహితుడు పెళ్లికి వచ్చాడు. అతడిని చూడగానే వధువు తనకీ పెళ్లి ఇష్టం లేదంటూ మొండికేసింది. ఈ పరిణామంతో నివ్వెరపోయిన బంధువులు... స్నేహితుడిపై దాడికి దిగారు. బంధువుల నుంచి స్నేహితుడు తప్పించుకొని పారిపోయాడు. మొత్తానికి పీటలమీద పెళ్లి ఇలా ఆగిపోయింది.